![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -418 లో..ఆదర్శ్ డ్రింక్ చేసి ముకుంద, మురారిలున్న ఫోటోని కాల్చేస్తాడు. అప్పుడే రేవతి మధులు వచ్చి ఆపుతారు. వాళ్ళు చూడు ఎలా చూసి నవ్వుతున్నారో చూడని రేవతితో ఆదర్శ్ చెప్తాడు. అక్కడ ఎవరు లేరని రేవతి చెప్తుంది.
ఆ తర్వాత కృష్ణ, మురారి ఇద్దరు ముకుంద గురించి వెతికి వెతికి ఇంటికి వస్తారు. ముకుంద ఏమైనా వచ్చిందా అని మురారి ఇంట్లో వాళ్ళని అడుగుతాడు. రాలేదని చెప్తారు. అప్పుడే మధు హడావిడిగా వచ్చి న్యూస్ పెడతాడు. అందులో ముప్పై సంవత్సరాల యువతి ట్రైన్ కి ఎదరుగా వెళ్లి ఆత్మహత్య చేసుకుందని చెప్పగానే.. అది ముకుందనే అంటు రేవతి ఏడుస్తుంది. ముకుంద అయి ఉండదని మురారి అంటాడు. ఈ విషయం ఆదర్శ్ కి చెప్పొద్దని అనగానే అని ఆదర్శ్ వచ్చి.. నా భార్య చనిపోయిందన్న నిజం కూడా దాచాలని అనుకుంటున్నావా.. నా భార్య చావుకి నువ్వే కారణం ఒప్పుకో కృష్ణ అని ఆదర్శ్ అంటాడు. దాంతో అందరు షాక్ అవుతారు. ముందు అది ముకుంద నో కాదో వెళ్లి చూడాలి అనుకుని అందరు హాస్పిటల్ కి బయలుదేర్తారు. ఆ తర్వాత ముకుంద చనిపోయిందని ముకుంద వాళ్ళ నాన్న దేవ్ కి ఫోన్ చేసి చెప్పి రమ్మని చెప్తాడు. అప్పుడే మురారి, ఆదర్శ్ వాళ్ళు హాస్పిటల్ లో శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళగానే ముకుంద ఇక లేదని చెప్తాడు. అది విని అందరు షాక్ అవుతారు.
ఆ తర్వాత మీ వల్లే నా కూతురు చనిపోయింది.. నా కూతురిది ఆత్మహత్య కాదు హత్య. ఇదంతా నీ వల్లే నా కూతురిని అర్థం చేసుకొని ఉండుంటే ఇక్కడ వరకు వచ్చేది కాదని మురారిపై శ్రీనివాస్ కోప్పడతాడు. మీరు ఇక్కడ నుండి వెళ్లిపోండి అని శ్రీనివాస్ చెప్తాడు. ఆ తర్వాత అందరు ఇంటికి వచ్చి ముకంద గురించి బాధపడతారు.. మరొకవైపు శ్రీనివాస్ తన ఇంటికి వెళ్తాడు. అక్కడ వెళ్లేసరికి ముకుంద ఉంటుంది. తనని చూసి శ్రీనివాస్ షాక్ అవుతాడు. తరువాయి భాగంలో మమ్మల్ని పంపించేసి నీ భర్తతో నువు హ్యాపీగా ఉండడానికే ప్లాన్ చేసావ్ కదా అని కృష్ణతో ఆదర్శ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |